fbpx
Saturday, January 18, 2025
HomeMovie News'మంచి రోజులు వచ్చాయి' ఫస్ట్ సింగిల్ రిలీజ్

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

ManchiRojuluVachayi First Single

టాలీవుడ్: తాను నేను సినిమాతో పరిచయం అయ్యి పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంతోష్ శోభన్. ఈ మధ్య ఓటీటీ లో విడుదలైన ‘ఏక్ మినీ కథ‘ సినిమా ఈ యంగ్ హీరో కెరీర్ కి బాగా కలిసొచ్చింది. ఆ సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత వరుస ఆఫర్లు పొందుతున్నాడు. ప్రస్తుతం దాదాపు 3 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మొదట మారుతీ దర్శకత్వంలో రూపొందిన సినిమా విడుదల అవబోతుంది. ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. అతి తక్కువ షూటింగ్ డేస్ లో ఈ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మారుతీ.

ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఈ సినిమా లోని పాత్రలన్నిటిని పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేసారు. ఇపుడు ఈ సినిమాలోని మొదటి పాటని రిలీజ్ చేసారు. ‘సో సో గా’ అంటూ సాగే ఈ పాటని విడుదల చేసారు మేకర్స్. ఒక మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్న ఈ పాటని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరచగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్ లో ఈ పాత కూడా చేరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ పాటతో సంతోష్ శోభన్ డాన్స్ లో కూడా మెప్పించాడు. యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ మరియు SKN ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular