టాలీవుడ్: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న సినిమా ‘మోసగాళ్లు’. ఈ సినిమాలో వీళ్లిద్దరు అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారని ముందే ప్రకటించారు. AVA ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన టీజర్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో విడుదల చేసారు. తన బాల్య మిత్రుడు విష్ణు కి, అలాగే కాజల్ కి మరియు ఈ సినిమా టీం కి అల్ ది బెస్ట్ అని చెప్తూ అల్లు అర్జున్ ఈ సినిమా టీజర్ ని పోస్ట్ చేసారు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో జరిగిన ఒక పెద్ద స్కాం మీద ఈ సినిమా ఉండబోతోందని ముందే తెలిపారు. యూనైటెడ్ స్టేట్స్ లో జరిగిన 450 మిల్లియన్ డాలర్ల స్కాం గురించి ట్రంప్ మాట్లాడబోతున్నారు అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెస్ మీట్ తో ఈ సినిమా టీజర్ ఆరంభం అవుతుంది. ఈ స్కామ్ చేసిన నేరస్తలుని త్వరలోనే పట్టుకుంటామని ట్రంప్ ప్రకటిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇండియా లో ఒక గో డౌన్ లో బస్తాల్లో కుప్పలు కుప్పలు గ డబ్బుల కట్టల మధ్య విష్ణు ‘ ఆట ఇపుడే మొదలైంది’ అంటూ కాజల్ తో నడుస్తూ స్టైలిష్ గా టీజర్ ఎండ్ చేసారు. చూపించినంతవరకి టీజర్ రిచ్ గానే ఉంది. సినిమా కాన్సెప్ట్ కూడా రిచ్ గా (కంటెంట్ పరంగా) ప్రేక్షకులు సినిమాని సూపర్ హిట్ చేసే పనిలో ఉంటారు.