fbpx
Wednesday, April 23, 2025
HomeMovie Newsసైబర్ ఐటీ స్కాం నేపథ్యంలో 'మోసగాళ్లు'

సైబర్ ఐటీ స్కాం నేపథ్యంలో ‘మోసగాళ్లు’

ManchuVishnu Mosagallu TrailerReleased

టాలీవుడ్: మంచు హీరో విష్ణు హీరోగా ప్రస్తుతం విడుదలకి సిద్ధం చేసిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. ఒక సాధారణ మనిషి డబ్బు బాగా సంపాదిస్తేనే ఇక్కడ విలువ, సంపాదించడం ఎలా అనే ఆలోచన నుండి ప్రారంభం అయ్యి ఒక పెద్ద సైబర్ క్రైమ్ చేస్తూ అతి పెద్ద స్కామ్ చేసి బస్తాల్లో డబ్బులు ఎలా సంపాదించాడు.. దాని తర్వాత ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడు అనేది సినిమా కధ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘పైకి ఎదగడానికి చాలా మంది కస్టపడి పైకి ఎదుగుతారు కానీ పైకి ఎదిగాక వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టే ఇక్కడ ఉంటాడా? ఉంటే ఎంత కాలం ఉంటాడు అనే విషయం డిసైడ్ అవుతుంది ‘ లాంటి డైలాగ్స్ తో ట్రైలర్ లో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాలో విష్ణు కి సిస్టర్ కారెక్టర్ లో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మరి కొన్ని ముఖ్య పాత్రల్లో నవదీప్, నవీన్ చంద్ర, రవి బాబు మరియు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సునీల్ శెట్టి నటించాడు. ఒక పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు సొంత నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. జెఫ్రీ చిన్ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహింహరు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన సామ్.సి ఎస్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Mosagallu Telugu Movie Trailer | Vishnu Manchu | Kajal Aggarwal | Suniel Shetty | Telugu FilmNagar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular