టాలీవుడ్: ఒక్కో ఇండస్ట్రీ లో ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో శకం నడుస్తూ ఉంటుంది. తెలుగు లో 90 ల నుండి దాదాపు 2010 వారికి తన సంగీతంతో ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు మణి శర్మ. మెలోడీ బ్రహ్మ అని గుర్తింపు తెచ్చుకున్న ఈ సంగీత దర్శకుడు ఇండస్ట్రీ లో ఉన్న అందరు టాప్ హీరోల సినిమాలకి సంగీతం అందించి అప్పట్లో టాప్ పోసిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్, థమన్ టాప్ పొజిషన్ లోకి వెళ్లడం తో మణి శర్మ వెనకబడ్డాడు. మధ్యలో కొన్ని సంవత్సరాలు మణి శర్మ దగ్గరి నుండి సంవత్సరానికి ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికిప్పుడు మణిశర్మ చేతిలో 12 సినిమాలతో మరోసారి ఇండస్ట్రీ టాప్ మ్యూజిషియన్ దిశగా వెళ్తున్నాడు.
ఈ సంవత్సరం ఆరంభం లో విడుదలైన రామ్ నటించిన ‘రెడ్’ కి మణి శర్మ సంగీతం అందించాడు. ప్రస్తుతం మణి శర్మ నుండి చిరంజీవి నటిస్తున్న ఆచార్య, వెంకటేష్ ‘నారప్ప‘, గోపీచంద్ ‘సీటిమార్’ , సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, శర్వానంద్ ’18 ‘, నితిన్ నటిస్తున్న ‘పవర్ పేట’, పూరి జగన్నాద్ రూపొందిస్తున్న ‘లైగర్’ ఇవే కాకుండా గుణ శేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘శాకుంతలం’ సినిమాకి కూడా మణి శర్మ సంగీతం అందింస్తున్నాడు. ఇలా టాప్ హీరో చిరంజీవి దగ్గరి నుండి ప్రతిష్టాత్మక సినిమాలు మరియు మీడియం హీరోల సినిమాలు అన్ని కవర్ చేస్తూ మరో సారి మంచి సంగీతం అందిస్తూ సంగీత అభిమానులని అలరిస్తున్నాడు.