టాలీవుడ్: అక్కినేని ఫామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ రీసెంట్ గా ‘మళ్ళీ మొదలైంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పెళ్లి, విడాకులు మళ్ళీ పెళ్లి అనే కాన్సెప్ట్ పైన ఈ సినిమా రూపొందుతుంది. సుమంత్ కూడా నిజ జీవితంలో విడాకులు అవడం తో ఆ విషయాన్నీ వాడుకుని బాగానే పబ్లి సిటీ పొందారు. ఈ సినిమా అర్బన్ కపుల్ రిలేషన్షిప్స్ ఆధారంగా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీం ఈ సినిమాలో నటిస్తున్న నటులందరిని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నారు.
ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మంజుల ‘షో ‘ లాంటి సినిమాలలో నటించింది. తరువాత అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసింది. రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాలో కూడా రామ్ చరణ్ అక్క పాత్రలో మెరిసింది. మూడు సంవత్సరాల క్రితం సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమా కూడా డైరెక్ట్ చేసింది కానీ సినిమా ప్లాప్ ని మూట కట్టుకుంది. ప్రస్తుతం ‘మళ్ళీ మొదలైంది’ సినిమాలో నటించనున్నట్టు ఈ రోజు ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాలో డాక్టర్ మిత్ర అనే థెరపిస్ట్ పాత్రలో నటించనున్నట్టు తెలిపారు. తెలివి కలిగిన, అందరిని నమ్ముతూ అవతలి వారిని స్టడీ చేసి గైడెన్స్ పాత్ర అన్నట్టు పరిచయం చేసారు. ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ సుహాసిని మణి రత్నం కూడా నటించనున్నారు. ఈ మధ్యనే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ సినిమా టీం మరి కొద్దీ రోజుల్లో విడుదల తేదీ కూడా ప్రకటించ అవకాశాలు ఉన్నాయి.