ఢిల్లీ: భారత మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించి యూపీఏ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు.
1991లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన తీసుకున్న ఎల్‌పిజి సంస్కరణలు దేశ ఆర్థికవ్యవస్థకు గణనీయమైన మలుపు తీసుకొచ్చాయి.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, యూజీసీ చైర్మన్‌గా కూడా మన్మోహన్ సింగ్ సేవలు అందించారు. 1987లో పద్మవిభూషణ్ అవార్డు, 2010లో వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు అందుకున్నారు.
పాకిస్థాన్‌లో 1932లో జన్మించిన మన్మోహన్, దేశ విభజన అనంతరం భారతదేశానికి వచ్చారు. ఆయనకు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ సాధించిన సాంప్రదాయ, ఆర్థిక విజయాలు భారత ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి.