న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మరియు కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా ఆయన డెంగ్యూ జబ్బుతో బాధపడుతున్నారని, అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్య అధికారులు శనివారం తెలిపారు.
అయితే మన్మోహన్‌సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు. కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్‌లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని, ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఒక ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు.
ఎయిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ అయిన నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.