fbpx
Tuesday, December 24, 2024
HomeTelanganaపాత పద్ధతిలోనే మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేయనున్న తెలంగాణ

పాత పద్ధతిలోనే మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేయనున్న తెలంగాణ

MANUAL-REGISTRATIONS-CONTINUE-IN-TELANGANA

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర లావాదేవీల నమోదు 2020 డిసెంబర్ 14 న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల నుండి ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్‌ వివరాలు అడగకుండా మాన్యువల్‌కు మార్పులు చేసే దాకా స్లాట్‌ బుకింగ్‌ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో కొత్త రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో తిరిగి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సోమవారం నుంచి ముందులాగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికైతే రిజిస్ట్రేషన్లు కార్డు పద్ధతిలోనే జరుగుతాయి. ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ ఆప్షన్ నిలివివేశారు. ఇదివరకే స్లాట్ బుక్‌ చేసుకున్న వారికి మాత్రం వారికి కేటాయించిన తేదిల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త స్లాట్‌ బుకింగ్‌ కోసం ఎవరూ అడగవద్దని, కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకూడదని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular