ఓస్లో: ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించే వ్యక్తులు మరియు సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ను వరించింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది.
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ మరియు స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ ఈ ఇద్దరికీ ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.
ఈ ఇద్దరిలో ఒకరైన దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, మరియు ఇంకొకరు నోవాయా గజెటా వార్తాపత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు తమ పత్రిక ద్వారా ఆయన ప్రచురించారు.
దీంతో అతని మీద అనేక దాడులు చేయడమే బెదిరింపులు కూడా వచ్చాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు.