fbpx
Thursday, September 19, 2024
HomeMovie Newsఈ వారం బాక్సాఫీస్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, మరికొన్నివిడుదల

ఈ వారం బాక్సాఫీస్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, మరికొన్నివిడుదల

MARUTHINAGAR-SUBRAMANYAM-AND-OTHER-MOVIES-RELEASING
MARUTHINAGAR-SUBRAMANYAM-AND-OTHER-MOVIES-RELEASING

మూవీడెస్క్: సినీ ప్రేమికులు కొన్ని ఆసక్తికర సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాబోయే వాటిలో హైప్ తీసుకొస్తున్నది మాత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.

రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్, సుకుమార్ హాజరు కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటంతో పాటు, సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం.

పెద్ద బడ్జెట్ లేకపోయినా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక మిగతా సినిమాలు పెద్దగా ప్రచారంలో లేకపోవడం వల్ల, అన్ని కళ్ళు మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పైనే ఉన్నాయి.

ఇక ఇతర చిత్రాల విషయానికి వస్తే, బండి సరోజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పరాక్రమం ఆగస్టు 22న విడుదలైంది.

అలాగే రేవు అనే చిన్న సినిమా కూడా ఆగస్టు 25న విడుదలకు సిద్ధమైంది. హర్రర్ కామెడీని ఇష్టపడేవారికి డిమోంటే కాలనీ 2 తెలుగు వెర్షన్ ఆకట్టుకునే అవకాశం ఉంది, ఈ సినిమా కూడా 23న విడుదల కానుంది.

ఇక నాని కొత్త సినిమా సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదల కానుంది, ఈ నేపథ్యంలో ఈ వారంలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular