టాలీవుడ్: సినిమా వాళ్ళకి సంక్రాంతి సీజన్ అంటే బాగా కలిసొచ్చే టైం. సినిమా కొంచెం బాగుందని టాక్ వచ్చినా, ఎన్ని సినిమాలు విడుదలైనా, వచ్చినా ప్రతీ సినిమా ఆడుతుంది మంచి కలెక్షన్స్ వస్తాయి అని ప్రతి సంవత్సరం రుజువు అవుతూనే ఉంది. అందుకే సంక్రాంతి టైం లో విడుదల చేయడానికి చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అయితే ఈ సారి పరిస్థితి వేరే లా ఉంది. ఇపుడిపుడే థియేటర్లు తెరుచుకోవడం, ఇంకా పెద్ద సినిమాలు ఏవి విడుదల అవకపోవడం, జనాలు థియేటర్ లకి వస్తారా రారా లాంటి అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. ఈ నెల 25 న సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్‘ విడుదల అయిన తర్వాత కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈలోగానే మాస్ మహారాజ్ రవితేజ తన ‘క్రాక్’ సినిమాని సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. రవి తేజ, శృతి హాసన్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో రవి తేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో జరిగే దారుణాల నేపధ్యం లో ఈ సినిమా ఉండబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత రవితేజ తో కలిసి మూడవ సినిమా చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాసారు. థమన్ అందించిన సంగీతం పైన ట్రోల్ల్స్ వినిపించినప్పటికీ పాటలు పరవాలేదనిపించాయి. ఈ సంక్రాంతి కి ఈ సినిమా హిట్ కొట్టి సంక్రాంతి సెంటిమెంట్ ని అలాగే నిలపాలని ఆశిద్దాం.