మూవీ డెస్క్ మట్కా: 1950ల చివరలో ప్రారంభమైన కథలో వాసు (వరుణ్ తేజ్) బర్మా నుంచి శరణార్ధిగా విశాఖపట్నం వస్తాడు. అక్కడ నెమ్మదిగా క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ముంబై వెళ్లినప్పుడు ‘మట్కా’ గేమ్ పై మోజు పెంచుకొని, దాన్ని విశాఖలో పరిచయం చేస్తాడు.
కొద్దిరోజుల్లోనే మట్కా కింగ్‌గా మారిపోతాడు. కానీ, అన్నింటికీ ముగింపు ఉంటుందని వాసుకు బాగా తెలిసివస్తుంది. ఆయన సామ్రాజ్యంపై భారత ప్రభుత్వమే దెబ్బ కొట్టడం కథలో ప్రధాన సంఘటనగా మారుతుంది. ఇక అతను చివరికి సాధించింది ఏంటి అనేది సినిమా అసలు కథ.
విశ్లేషణ:
వరుణ్ తేజ్ పాత్రకు అనుగుణంగా ప్రతి వయస్సులోని లుక్‌లోనూ పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయాడు. రెండో భాగంలో గ్యాంగ్‌స్టర్‌గా అతని నటన ఆకట్టుకుంటుంది. కథ నెమ్మదిగా సాగినా రెండో భాగం కొంత డ్రామా, భావోద్వేగాలతో నడుస్తుంది.
1980ల నాటి కాలం, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవీన్ చంద్ర పాత్రలో మంచి నటన కనబర్చాడు, అయితే మరింత స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుండేదనిపిస్తుంది.
సినిమాలో కథనం కూడా అనేక పాత సినిమాలలానే ఉండటంతో ప్రేక్షకులకు ఎలాంటి ఉత్కంఠ కలగలేదు. కథకు ప్రధానాంశం చేరుకునేందుకు దర్శకుడు కరుణ కుమార్ చాలాసేపు కథను సాగదేశాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లొనే నిరుత్సాహకరంగా సాగుతుంది.
కొంతమంది కీలక పాత్రల బ్యాక్ డ్రాప్ సరిగా క్లిక్ కాలేదు. అలాగే, ప్రొసీడింగ్స్ లో గ్రిప్ లేకపోవడం, క్లయిమాక్స్ లో బలం లేకపోవడంతో సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి, జి.వి.ప్రకాష్ అందించిన పాటలు, బీజీఎం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొదటి భాగంలో ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటన
ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్క్రీన్ ప్లే
ఫస్ట్ హాఫ్
మ్యూజిక్
రేటింగ్:2.25/5