fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమత్తు వదలరా 2: బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ కలెక్షన్స్

మత్తు వదలరా 2: బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ కలెక్షన్స్

MATTU-VADALARA-2-IS-ROCKING-WITH-POWERFUL-COLLECTIONS
MATTU-VADALARA-2-IS-ROCKING-WITH-POWERFUL-COLLECTIONS

మూవీడెస్క్: మత్తు వదలరా 2 సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

శ్రీ సింహ, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

మొదటి సినిమాకి సీక్వెల్ గా రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో భారీ స్పందన లభించింది.

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ, మూడు రోజుల్లో 16.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

యూఎస్ఏ లో ఈ సినిమా ఇప్పటివరకు 615K డాలర్స్ కలెక్షన్స్ సాధించి, 1 మిలియన్ క్లబ్ లో చేరే దిశగా ముందుకు సాగుతోంది.

చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, వినోదాత్మకమైన కథ, ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఇక సెప్టెంబర్ 27న ‘దేవర’ రానుండు.

అప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద సుస్థిరమైన రన్ కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే మత్తు వదలరా పార్ట్ 3 కూడా ఉంటుందని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular