విశ్వక్ సేన్ హీరోగా, రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన మెకానిక్ రాకీ నేడు విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కథ: మలక్‌పేట ప్రాంతంలో గ్యారేజ్ నడిపే రాకీ (విశ్వక్ సేన్), జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులను తట్టుకుంటూ తన గ్యారేజ్‌ను కాపాడుకుంటూ ఉంటాడు. కాలేజీ రోజుల్లోనే ప్రేమించిన ప్రియా (మీనాక్షి చౌదరి) మళ్లీ రాకీ జీవితంలోకి వస్తుంది. కుటుంబ బాధ్యతలు మోస్తున్న ప్రియాకు సహాయం చేయాలనుకుంటున్న రాకీ, గ్యారేజ్‌పై దృష్టి పెట్టిన రంకి రెడ్డి (సునీల్) సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యలో మాయ (శ్రద్ధా శ్రీనాథ్)తో సంబంధాలు, స్నేహితుడు శేఖర్ మరణం వంటి అంశాలు కథకు మలుపులుగా నిలుస్తాయి. ఇక రాకి ఎదుర్కొన్న అసలు సమస్య ఏంటీ? విలన్స్ ను ఎలా ఎదిరిస్తాడు అనే అంశాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: విశ్వక్ సేన్ పాత్రకు తగ్గట్టుగా నటించాడు కానీ, అతని స్టైల్‌లో ఓ కొత్తదనం కనిపించదు. ఇంతకుముందు చేసిన సినిమాల తరహాలోనే రొటీన్ గా ఉంటుంది. మీనాక్షి, శ్రద్ధా పాత్రలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, వాటిని కథలో బలంగా వినియోగించుకోలేకపోయారు. సునీల్ ప్రతినాయకుడిగా సాదాసీదాగా కనిపించాడు. నరేశ్ పాత్ర భావోద్వేగాన్ని రప్పించగలిగినా, అది అంతగా ప్రభావితం చేయదు.
ఇక కథలో కొన్ని మలుపులు ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, కథనాల్లో లాగ్ స్పష్టంగా కనిపిస్తుంది. జేక్స్ బిజోయ్ సంగీతం సరైన మూడ్‌ను తీసుకురావడంలో ఫర్వాలేదనిపించగా, కెమెరా పనితనం ఓకే. కానీ, సంభాషణలు, కామెడీ సన్నివేశాలు రొటీన్‌గా అనిపించాయి. మొత్తానికి, మెకానిక్ రాకీ రాకీ ప్రయాణంలో ఆసక్తి నెలకొల్పే ప్రయత్నం చేసినప్పటికీ, కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడం సినిమా బలాన్ని తగ్గించింది. పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే సెకండ్ హాఫ్ బాగుంటుందని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
కొన్ని ట్విస్టులు
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
మ్యూజిక్
రోటీన క్యారెక్టర్స్
రేటింగ్: 2.25/5