fbpx
Sunday, January 19, 2025
HomeBusinessమీడియా రంగంపైనా పడ్డ కోవిడ్ దెబ్బ

మీడియా రంగంపైనా పడ్డ కోవిడ్ దెబ్బ

MEDIA-SECTOR-AFFECTED-BY-COVID

న్యూఢిల్లీ: కరోనా ప్రపంచంలోని ఎన్నో రంగాలను ఇప్పటికే దెబ్బ తీసింది. మన దేశంలో కూడా ఈ దెబ్బకు చాళా రంగాళు కుదెలయ్యాయి. వాటితో పాటు దేశీయ మీడియా, వినోద రంగాల్ని కూడా కరోనా కోలుకోలేని రకంగా దెబ్బ తీసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం రూ.1,75,100 కోట్లున్న మీడియా రంగం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) దాదాపు 20 శాతం తగ్గి రూ.1,40,200 కోట్లకు పడిపోనున్నట్టు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తన నివేదికలో తెలిపింది.

కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) లో మాత్రం ఈ రంగం కోలుకుని 33 శాతం వృద్ధి రేటుతో రూ.1,86,600 కోట్ల ఆదాయం నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. డిజిటలీకరణ, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం లాంటి పరిణామాలు ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తాయని తెలిపింది.

నివేదిక ఇతర ప్రధాన అంశాలు:
2028 నాటికి 100 కోట్లకు డిజిటల్‌ మీడియా వినియోగదారులు చేరే అవకాశం ఉండొచ్చు. లాక్‌డౌన్‌తో వినియోగదారుల అభిరుచుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కంటెంట్‌ నుంచి పంపిణీ వరకు పెరిగిన డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం. డిజిటల్‌ నైపుణ్యాలు అలవర్చుకోవడంలో తప్పని సవాళ్లు. డిజిటల్‌ టెక్నాలజీతో కలిసొస్తున్న ఖర్చులు, సమయం.

టీవీ మీడియాను మించనున్న డిజిటల్‌ మీడియా ప్రకటనలు, ప్రచార ఆదాయం. ఆదాయ పరంగా పుంజుకున్న ఓటీటీ యాప్‌లు. తగ్గుతున్న ప్రింట్‌, రేడియో, టీవీ మీడియాల ప్రభావం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular