మూవీడెస్క్: టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి మంచి గుర్తింపు పొందింది. తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంటున్నప్పటికీ, చేస్తున్న సినిమాలు మాత్రం నిరాశపరుస్తున్నాయి.
ఇటీవలి కాలంలో విడుదలైన గుంటూరు కారం సినిమాలో కూడా పెద్దగా మేజర్ రోల్ ఏమి కాదు.
సీనియర్ హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ, పాత్ర పరంగా పెద్దగా స్కోప్ లేకపోవడం ఆమె అభిమానులకు కలచివేసింది.
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నది కావడంతో నిరాశ వ్యక్తమైంది.
ఇప్పుడీ పరిస్థితి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (G.O.A.T) సినిమాలో కూడా రిపీట్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో జోడీగా నటించే అవకాశం వచ్చినా, మీనాక్షికి పెద్దగా స్క్రీన్ టైమ్ దక్కలేదని తెలుస్తోంది.
పాటలో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించినా, అది అభిమానులను పెద్దగా అలరించలేదట.
దీంతో మీనాక్షి తన కెరీర్‌లో మరిన్ని ప్రధాన పాత్రల కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లైన్ లో ఉన్న మెకానిక్ రాకీ – లక్కీ భాస్కర్ సినిమాలు తప్పకుండా హిట్ కావాల్సిన అవసరం ఉంది.
ఈ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వరుణ్ తేజ్‌తో చేస్తున్న మట్కా సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తే, మీనాక్షి చౌదరి తన కెరీర్ లో మరో కీలకమైన అడుగు వేయవచ్చు.