తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది.
ఈ సమావేశానికి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.
సినీ పరిశ్రమ నుంచి నాగార్జున, వెంకటేశ్, దిల్ రాజు, మురళీమోహన్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, వరుణ్ తేజ్, నితిన్, శివ బాలాజీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
అయితే, మెగాస్టార్ చిరంజీవి ఈ సమావేశానికి హాజరుకాలేదు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్న కారణంగా రాలేకపోయారని సమాచారం. చిరంజీవి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి పలు సమస్యలు, ప్రభుత్వ సాయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టిక్కెట్ ధరల నియంత్రణ, బెనిఫిట్ షోల అనుమతుల వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.