మూవీడెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం అద్భుతంగా జరిగిందని దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు.
బంజారాహిల్స్ పోలీస్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోలు పాల్గొన్నారు.
ముఖ్యంగా త్రివిక్రమ్, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వంటి వారు ఈ సమావేశానికి హాజరయ్యారు.
డైరెక్టర్ సాయి రాజేష్, సీఎం రేవంత్ తో భేటీ అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. “ముఖ్యమంత్రితో సమావేశం అద్భుతం.
ఇండస్ట్రీ అవసరాలకు ఆయన వెంటనే స్పందించడం విశేషం. కానీ కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన నెగటివ్ వార్తలు చూసి షాక్ అయ్యా,” అని తెలిపారు.
రేవంత్ పరిశ్రమ అడిగిన దానికంటే ఎక్కువ హామీలు ఇచ్చారని వెల్లడించారు.
సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వ వైఖరిని కూడా ఆయన ప్రశంసించారు. సమావేశంలో బెనిఫిట్ షోలు ఇకపై అనుమతించబోమని సీఎం స్పష్టంగా తెలిపారు.
అయితే, పరిశ్రమకు అవసరమైన మద్దతు అందిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఉపసంఘం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక టెంపుల్ ఎకో టూరిజం ప్రచారానికి ఇండస్ట్రీతో కలసి పనిచేయాలని సీఎం సూచించారు.
ఇండస్ట్రీకి ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షించడంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందించబోతోందని చెప్పడం పట్ల సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చర్చల ఫలితంగా ఇండస్ట్రీకి సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందని అంతా ఆశిస్తున్నారు.