ఏపీ: తెలుగు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించబోతోంది.
సినీ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కొంత కాలం అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు.
అయినప్పటికీ ఆయన, తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా సేవలందించారు.
మెగా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికై, ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇప్పుడేమో మరో తమ్ముడు నాగబాబు కూడా ఏపీ మంత్రిగా నియమితులవబోతున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు రాజకీయాల్లో కీలక పదవుల్లో గుర్తింపు అందుకోవడం భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం.
సినిమా రంగం నుంచి వచ్చిన ఈ కుటుంబం రాజకీయాల్లోనూ తమ సత్తా చాటుతోంది. ఈ అరుదైన ఫీట్ మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపునిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.