
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న చిరు… ఇప్పుడు మాస్, ఫన్ మాస్టర్ అనిల్‌తో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అయ్యారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 9న ఉగాది రోజున పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రం మే నెలలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుందని సమాచారం. చిరు కోసం అనిల్ సిద్ధం చేసిన స్క్రిప్ట్ పూర్తిగా కామెడీ, మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్ల మిక్స్‌తో ఉండనుందని టాక్.
ఇప్పటికే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి నాలుగు పాటలు కంపోజ్ అయిపోయాయని సమాచారం. ఆల్బమ్ ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ అయ్యింది అంటే, బిజినెస్ పరంగా కూడా మంచి ప్లానింగ్ జరుగుతోంది.
ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్‌తో మేకర్స్ దూసుకెళ్తున్నారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి హిట్ సెంటిమెంట్ ఉండటంతో, ఈ సినిమా కూడా అదే ట్రాక్‌ను ఫాలో అవుతుందనే నమ్మకం ఉంది. ఇదే సమయంలో చిరంజీవికి కూడా ఈ ఫెస్టివల్ సీజన్ మంచి లక్కీ సీజన్ కావడంతో హైప్ డబుల్ అయ్యింది.
మెగా అభిమానులకు ఉగాది నుంచే పండుగ మొదలైపోయినట్టే. సంక్రాంతికి చిరు అనిల్ రావిపూడి మూవీ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో ఊపేస్తుందో వేచి చూడాలి.