హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎన్నో కోట్ల మంది అభిమానుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
తాజాగా ఆయన ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guinness Book of Records) కూడా స్థానం సాధించారు. ఆయన ఏ అంశంలో గిన్నిస్ రికార్డు సాధించారన్నది ఆసక్తికరమైన విషయం.
తన 45 ఏళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేశారు. (Most prolific film star in the Indian film industry)
కాగా, ఇంత వరకు మరే నటుడి దగ్గర ఇంత అధిక సంఖ్యలో డ్యాన్స్ స్టెప్పులు వేసిన రికార్డులు లేనే లేవు.
1978లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక డ్యాన్స్ స్టెప్పులతో గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేశారు.
ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డును అందజేశారు.
కాగా, ఈ పురస్కారాన్ని బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా స్వీకరించడం ఈ కార్యక్రమం మరింత విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, చిరంజీవి కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, సుస్మిత, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.