మూవీడెస్క్: టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు ముందు వరుసలో ఉంటుంది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ వరుస హిట్స్ అందుకున్నారు.
కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాతో మెగాస్టార్ పాన్ ఇండియా మార్కెట్ ను పెంచుకునేందుకు రెడీ అవుతున్నారు.
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ ప్రాజెక్ట్ కోసం చిరు దాదాపు 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
అలాగే, త్వరలో శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్ లో చేయబోయే చిత్రానికి 75 కోట్ల రెమ్యునరేషన్ పొందనున్నారట.
మెగాస్టార్ తదుపరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం కూడా చిరంజీవి భారీ పారితోషికం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
టాలీవుడ్ లో టైర్ 1 హీరోల రెమ్యునరేషన్ రేంజ్ చూసుకుంటే, చిరంజీవి ఇప్పుడు సెంచరీ మార్క్ కు దగ్గరగా ఉన్నారనిపిస్తోంది.
ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు 150-300 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ రోజుల్లో, చిరంజీవి కూడా తన మార్కెట్ రేంజ్ తో రెమ్యునరేషన్ ను మెరుగుపరుచుకుంటున్నారు.
త్వరలో రాబోయే ప్రాజెక్టులు హిట్ అయితే చిరంజీవి రెమ్యునరేషన్ 100 కోట్ల మార్క్ దాటడం ఖాయం.
ఇప్పటికి టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అత్యధిక పారితోషికం పొందుతున్న స్టార్ చిరంజీవి కావడం గమనార్హం.