మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు షూటింగ్ 95% పూర్తయిందని, మిగిలినవి కొన్ని సన్నివేశాలు, ఓ స్పెషల్ సాంగ్ మాత్రమేనని తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన గ్లింప్స్ పట్ల మిశ్రమ స్పందన రావడంతో, గ్రాఫిక్స్ పనులపై మరింత శ్రద్ధ పెడుతున్నట్లు చిత్ర బృందం భావిస్తోంది. చిరంజీవి లుక్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను హై స్టాండర్డ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ పార్ట్ పూర్తికావడంతో, మిగతా చిన్న షూటింగ్ పనులు త్వరలోనే ముగుస్తాయి.
ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు టాక్. వాల్తేరు వీరయ్య లో ఊర్వశి రౌతేలా పాట హిట్ అయిన నేపథ్యంలో, మరో స్టార్ హీరోయిన్‌తో ఈ సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కీరవాణి అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ కానుంది. విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.