టాలీవుడ్: జనవరి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో థియేటర్ లలో విడుదల అవుతున్న సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు నాలుగు నెలలకి నాలుగు బ్లాక్ బస్టర్ లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రూపం లో ఒక పెద్ద హీరో సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. ఏప్రిల్ లో ప్రతీ వారంలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు వరుసగా లైన్ లో ఉన్నా కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో చిరంజీవి, వెంకటేష్, బాల కృష్ణ లాంటి పెద్ద హీరోల సినిమాలు విడుదలకి ఉన్నాయి.
ఈ రోజు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాకి సంబందించిన ప్రకటన విడుదల చేసారు మూవీ నిర్మాతలు. ఈ సినిమా మే నెల 13 న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఇపుడు విడుదలయ్యే పరిస్థితి కనపడకపోవడం తో ఈ సినిమాని మే 13 న విడుదల చేయలేకపోతున్నాం అని నిర్మాణ భాగస్వామి ‘కొణిదెల ప్రొడక్షన్’ టీం ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’, బాల కృష్ణ ‘అఖండ’ సినిమాలు కూడా వాయిదా వేసే ప్రకటనలు మరి కొద్దీ రోజుల్లో తెలియనున్నాయి.