టాలీవుడ్: టాలీవుడ్ లో ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య ఉంటుంది అనడం లో సందేహం లేదు. సైరా తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా మొదలుపెట్టాడు. కొరటాల కూడా చిరు కోసం చాల రోజులు ఎదురు చూసి స్క్రిప్ట్ పైన వర్క్ చేసి షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఇపుడు మెల్లిగా అందరూ బయటకి వచ్చి తమ తమ విధుల్లో నిమగ్నం అవుతుండడం తో సినిమా షూటింగ్ లు కూడా మొదలయ్యాయి. ఇపుడు చిరంజీవి సినిమా కూడా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది.
నవంబర్ 9 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవబోతున్నట్టు సినిమా ప్రొడక్షన్ హౌస్ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. కోవిడ్ నిబంధనల్ని జాగ్రత్తల్ని పాటిస్తూ ఈ సినిమా షూటింగ్ పగడ్బందీ గా చేసి తొందరగా ముగించి 2021 వేసవి కి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో చిరంజీవి తో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు అని వార్తలు ఉన్నాయి కానీ అధికారిక ప్రకటన అయితే ఏదీ రాలేదు. ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి , మణిశర్మ కాంబినేషన్ రిపీట్ అవబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.