టాలీవుడ్: దాదాపు రెండు దశాబ్దాలు మెగా స్టార్ గా స్టార్ ఆక్టర్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రోసర్ హీరోగా వెలుగు వెలిగిన చిరంజీవి ప్రజా సేవ చేయాలనీ ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ చిరు స్వభావానికి రాజకీయాలకి సెట్ అవలేదు. అయన చేయాలి అనుకున్నట్టుగా కాకుండా దారి మల్లడంతో రాజకీయాలకి స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాలు చేస్తూ తనకి అవకాశం వచ్చిన ప్రతీసారి తనలోని మానవతావాదిని బయటకి తెస్తున్నాడు.
కరోనా టైం లో ఆయన సేవలు మరువలేం. సినీ ఫామిలీ కోసం ఒక ట్రస్ట్ స్థాపించి ఫండ్స్ రైజ్ చేసి చిన్న సినీ కార్మికుల కస్టాలు తీర్చాడు. ఆక్సిజన్ సప్లైస్ కోసం తన సొంత డబ్బు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసి దాదాపు అన్ని జిల్లాల్లో ఆక్సీజన్ బ్యాంకు ఏర్పాట్లు చూసుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో చిన్న సినిమాలని అభినందిస్తూ ఆ సినిమాలకి కావాల్సిన సపోర్ట్ అందిస్తున్నారు. ఒకప్పుడు చిరు చేసిన గొప్ప పనులు ప్రజలకి తెలియక విమర్శించేవారు. ఇపుడు సోషల్ మీడియా వల్ల చిరు చేసే ప్రతీది ఎదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా బయటకి వస్తుంది.
ఇండస్ట్రీ కి పెద్ద దిక్కులా అన్ని అవసరాలని, ఎవరికైనా తన అవసరం ఉంది అది తనకి తెలిస్తే వెంటనే స్పందిస్తూ అందరివాడు అనిపించుకుంటున్నాడు. నిన్న మోహన్ బాబు ‘సన్ అఫ్ ఇండియా‘ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనగానే తానే స్వయంగా డబ్ చేసి మోహన్ బాబు కి సర్ప్రైస్ చేయాలి అనుకున్నట్టు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఇపుడు ఉన్న బిజీ లైఫ్ లో అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే తిప్పుకుంటున్న రోజుల్లో తన తోటి నటుడికి అడగ్గానే సమయం కేటాయించి డబ్బింగ్ చెప్పి సర్ప్రైస్ చేసే మంచి ఆలోచన ఎవరికీ ఉంటుంది అని పొగిడారు.
అంతే కాకుండా తమిళ నటుడు సూర్య తో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ని సూర్య తో లాంచ్ చేయించాలి అనగానే మీరు పెద్ద వాళ్ళు, మీకెందుకు మీరు అనుకున్న టైం కి నేను రిలీజ్ చేస్తానని చెప్పి అనుకున్న టైం కి విడుదల చేసారు అని సూర్య గురించి కూడా చెప్పి.. ఇలాంటి గొప్ప హృదయం ఎంతమందికి ఉంటుంది అని కొనియాడారు.
ఇలా పెద్ద పెద్ద తారలే ఏ మాత్రం ఈగో లేకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు, ఫాన్స్ కూడా ఒకరి సినిమాలకి ఇంకొక ఫాన్స్ సహాయం చేసుకుంటూ ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే బాగుంటుందని ఆశిద్దాం.