హైదరాబాద్: సామజిక కార్యక్రమాలు చేసే సెలెబ్రెటీల్లో ముందుండే మెగాస్టార్ చిరంజీవి కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుండి ఏదో ఒక రూపం లో తొలి నుండి తన వంతు ప్రయత్నంగా అవేర్ నెస్ కోసం వీడియోస్ , పోస్ట్స్, టీవీ లో యాడ్స్ చేస్తూ వచ్చాడు. సీసీసీ పేరిట తెలుగు సినీ కార్మికుల కోసం డబ్బులు కూడా కలెక్ట్ చేసి వాళ్ళని లాక్ డౌన్ సమయంలో ఆదుకున్నాడు. ఇపుడు కొత్తగా మాస్కుల ప్రాధాన్యం గురించి ఒక వీడియో తయారు చేసి పోస్ట్ చేసారు. ఈ వీడియో లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు తెలుగమ్మాయి ఇషా రెబ్బ మరియు RX100 హీరో కార్తికేయ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరిపై చిరు ప్రశంసలు కురిపించారు. ఆలోచనను పంచుకోగానే ముందుకొచ్చిన కార్తికేయ, ఈషాలకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.
మీసాలు మెలేయడం ఒకప్పుడు వీరత్వమని ఇప్పుడు మాస్కులు ధరించడం వీరుడి లక్షణమని పేర్కొంటూ వీడియో రూపంలో చిరంజీవి సందేశాన్ని ఇచ్చారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాలమీదికి తెస్తుంది అని గుర్తు చేశారు. చిరునవ్వు ముఖానికి చాలా అందమని. ఇప్పుడు ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే ముఖానికి మాస్క్ ధరించడం చాలా ముఖ్యమని మరో వీడియోలో మెసేజ్ ఇచ్చారు. ‘కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మీతోపాటు మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి’ అంటూ చిరంజీవి ఆ వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Good awareness, but it should be followed during movie shootings and also maintain 6 feet distance between lead actor and actress. we are already seeing tv serial actors effected with covid.