fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఫెంటాస్టిక్ ఫోర్ తో మెగా స్టార్

ఫెంటాస్టిక్ ఫోర్ తో మెగా స్టార్

MegastarChiranjeevi WithHis FourDirectors

టాలీవుడ్: మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి తర్వాత సినిమాల వేగం పెంచాడు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఆచార్య తో కలిపి నాలుగు సినిమాలు చిరంజీవి ప్రకటించాడు. ఈ నలుగురి దర్శకులతో కలిసి ఉన్న ఒక పిక్చర్ షేర్ చేసి ఫెంటాస్టిక్ ఫోర్ అని టాగ్ చేసాడు. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో ‘ఆచార్య’ అనే సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవాదాయ శాఖ లో జరుగుతున్న అక్రమాలని ఉద్దేశించి ఒక సోషల్ మెసేజ్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

దీని తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ దర్శకుడు మోహన్ రాజా తో మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసిఫెర్’ రీమేక్ ని ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నాడు. మెహర్ రమేష్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా దర్శకత్వం చేయబోతున్నాడు. అది కూడా ఇన్ని రోజుల తర్వాత మెగా స్టార్ సినిమా అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ డైరెక్టర్ తమిళ్ లో అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ సినిమాని రీమేక్ చేయబోతున్నాడు. దర్శకుడు బాబీ తో మరో సినిమా చేయబోతున్నట్టు ఒకానొక సమయం లో తెలిపారు. ఈ సినిమా గురించి మిగతా వివరాలేమీ తెలియదు. ట్విట్టర్ లో ఈ నలుగురు డైరెక్టర్ లతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి ‘నా నలుగురు కెప్టెన్స్.. ఈ నలుగురు ఫంటాస్టిక్ 4.. చార్ కధమ్’ అని ట్వీట్ చేసి తాను తీయబోయే సినిమాల దర్శకులు వీళ్ళు అని చెప్పకనే చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular