fbpx
Tuesday, December 24, 2024
HomeMovie Newsనిహారిక స్థానంలో మేఘా

నిహారిక స్థానంలో మేఘా

MeghaAakash Ropedin InplaceofNiharika

కోలీవుడ్: తమిళ్ అప్ కమింగ్ హీరో అశోక్ సెల్వన్, మెగా డాటర్ నిహారిక కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందాల్సి ఉంది. కానీ పెళ్లి సడన్ గా ఫిక్స్ అవడం వలన నిశితార్థం, పెళ్లి ఈ హడావిడి లో సినిమా కుదరదు అని నిహారిక ఈ సినిమా నుండి తప్పుకుంది. అయితే నిహారిక స్థానం లో ఇపుడు ఈ సినిమాలో మేఘా ఆకాష్ ని ఎంపిక చేసారు. మేఘా ఆకాష్ తెలుగు లో ‘లై’,’చల్ మోహన్ రంగ’ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమే.

కెనన్యా ఫిల్మ్స్ బ్యానర్ పై ‘స్వాతిని’ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కారెక్టర్ చాలా స్పెషల్ అని మేకర్స్ ముందే తెలిపారు. కోవిడ్ వల్ల షూటింగ్ ఆలస్యం అవడం, ఆ తర్వాత నిహారిక పెళ్లి పనులు వచ్చి పడడం వలన డేట్స్ సర్దుబాటు అవకపోవడం తో నిహారిక ఈ సినిమా నుండి తప్పుకోవడం తో తన తర్వాత ఈ సినిమాకి మేఘా సరిగ్గా సరిపోతుందని మేఘా ని సెలెక్ట్ చేసాం అని దర్శక నిర్మాతలు చెప్పాడు. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు మేకర్స్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular