fbpx
Saturday, April 26, 2025
HomeMovie Newsమానాడు: మెహర్జైలా పాట విడుదల

మానాడు: మెహర్జైలా పాట విడుదల

Meharzylaa SongReleaseFrom ShimbuMaanaaduMovie

కోలీవుడ్: టీ. రాజేందర్ వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి అనతి కాలం లోనే సూపర్ స్టార్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శింబు. ‘మన్మధ’, ‘వల్లభ’ లాంటి సినిమాల ద్వారా తెలుగు లో కూడా శింబు కు కొద్దిగా గుర్తింపు ఉంది. కానీ కొన్ని వివాదాల్లో చిక్కుకుని ప్రొడ్యూసర్స్ తో, డైరెక్టర్స్ తో గొడవలు పడి తన ఇమేజ్ ని పాడు చేసుకున్నాడు. అంతే కాకుండా బాడీ కూడా షేప్ అవుట్ అయ్యే స్టేజ్ కి రావడంతో శింబు పని అయిపోయింది అనుకున్నారు. కానీ అనుకోకుండా బాడీ మేకర్ ఓవర్ చేసుకుని ఈ సంవత్సరం సంక్రాంతి కి ‘ఈశ్వరన్’ సినిమాతో తన ఓల్డ్ లుక్ కి మారిపోయి షాక్ ఇచ్చాడు శింబు.

శింబు ప్రస్తుతం తమిళ్ లో స్టైలిష్ సినిమాలు రూపొందించే డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శింబు ఒక ముస్లిం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇందులో శింబు లుక్ కూడా కొత్తగా ఉండడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయ్. ఈ సినిమాలో శింబు కి జోడీ గా కళ్యాణి ప్రియదర్శి నటిస్తుంది. ఈ సినిమానుండి మెహర్జైలా అంటూ సాగే పాట ఈరోజు విడుదలైంది. ఒక వేడుక లో ఈ పాట ఉండనున్నట్టు లిరికల్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది. సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.

Meherezylaa - Lyric Video | Maanaadu | Silambarasan TR | Yuvan Shankar Raja | Venkat Prabhu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular