అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖామాత్యులైన మేకపాటి గౌతమ్ రెడ్డి (50) సోమవారం హఠాన్మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.
ఆయనకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ కు తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. మేకపాటి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ విషయం తెలిసాక తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు.