హైదరాబాద్: ‘మెట్రో కథలు’ అనే కొత్త వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమ్ అవబోతుంది. మెట్రోల్లో ఉండే అన్ని రకాల వర్గాలు అనగా సంపన్నులు, పేద వాళ్ళు, మధ్య తరగతి వాల్లు ఇలా రక రకాల వాళ్ళని కలిపే ఒక కామన్ ఎలిమెంట్ ని ఆధారంగా చేసుకుని దాని చుట్టూ కథ అల్లుకొని ఆసక్తి కారంగా కథనం నడిపించడమే ఈ వెబ్ సిరీస్ థీమ్ అనేది అర్ధం అవుతుంది.
‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ‘మెట్రో కథలు’ టీజర్ ఈరోజు రిలీజైంది. టీజర్ లో కథ ఏమి రివీల్ చేయనప్పటికీ అన్ని పాత్రలని అలా ఒకసారి చూపించాడు. టీజర్ లో కనిపించిన ప్రతీ పాత్రం ద్వారా కథలో ఇంటెన్సిటీ ఉన్నట్టు చూపించాడు. ఇందులో రాజీవ్ కనకాల సీరియస్ గా కనిపించే ఒక ముస్లిం తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. యాంకర్ కం నటి గాయత్రి భార్గవి, సన, బిగ్ బాస్ ఫేం అలీ రెజా, నందిని రాయ్, జార్జి రెడ్డి ఫేమ్ తిరువీర్ ఇలా టీజర్ లో కనిపించిన ప్రతీ ఒక్కరు ఆకట్టుకున్నారు. టీజర్ లో వినిపించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. దైనందిన జీవితాలలో మనకి రెగ్యులర్ గా కనిపించే పాత్రల స్వాభావాల ఆధారంగా రచించినట్టు అర్ధం అవుతుంది. టీజర్ లో ఉన్న అంతే ఇంటెన్సిటీ వెబ్ సిరీస్ లో కూడా కనిపిస్తే ఈ సిరీస్ సూపర్ హిట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 14 నుండి ‘ఆహా‘ ఓటీటీ లో అందుబాటులో ఉంచబోతున్నారు.