ముంబై: ప్రయాణాల్లో ఉన్నప్పుడు నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యకు చెక్ పెట్టడానికి ఎంజీ మోటార్స్ ఇండియా దేశ టెలికాం దిగ్గహం జియో నెట్‌వర్క్‌లు జత కట్టాయి. కెనెక్టివిటీ లో ఎలాంటి అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ఈ రెండు కంపెనీలు తమ వినియోగదారులకు హమీ ఇచ్చాయి.
ఈ సందర్భంగా ఎంజీ, జియో నెట్‌వర్క్‌ల రెండింటి మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)కి సంబంధించిన సాంకేతికతలో మరొక ముందు అడుగు వేసింది. మోరిసన్ గ్యారెజేస్ ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లను భారత రోడ్లపై ప్రవేశ పెట్టాయి.
ఇదిలా ఉండాగా త్వరలోనే ఎంజీ మోటార్స్ మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ మోడల్ లో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో ఎంజీ కంపెనీ జోడీ కట్టింది.
త్వరలో ఎంజీ నుండి రాబోతున్న ఎస్‌యూవీలో నిరంతరాయంగా నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్‌వర్క్ సహాయంతో ఎంజీ తమ మోడల్ లో అందించబోతోంది. తమ కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు కావాల్సిన ఇతర హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను జియో అందించనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4జీ ఇంటర్‌నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.