CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ చెన్నైపై ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 9 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ (76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో 177 పరుగుల టార్గెట్‌ను 15.4 ఓవర్లలో సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివమ్ దూబే (50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆరంభంలో రచిన్ రవీంద్ర త్వరగా వెనుదిరగగా, 17 ఏళ్ల ఆయూష్ మాత్రే 32 పరుగులతో మెరుపులు మెరిపించాడు.
ముంబయి బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీసి చెన్నై రన్‌ఫ్లోకు బ్రేక్ వేశాడు. చాహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ తలో వికెట్ తీశారు. చివర్లో ధోనీ ఔట్ కావడంతో స్కోరు 176పైనే ఆగిపోయింది.
లక్ష్యఛేదనలో ముంబయి ఓ వికెట్ కోల్పోయినా, రోహిత్-సూర్య జోడీ మ్యాజికల్ బ్యాటింగ్‌తో చెన్నైపై గెలుపును సులభం చేసింది. రెండో వికెట్‌కు 120కి పైగా భాగస్వామ్యం నిలిచింది.
ఈ విజయం ముంబయికి నాలుగో గెలుపు కాగా, చెన్నైకు ఇది వరుసగా ఆరో ఓటమి. సీజన్‌లో ముంబయి బౌలింగ్, బ్యాటింగ్ సమపాళ్లలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.