స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 18లో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసి 221/5 స్కోరు చేయగా, ముంబయి 209/9తో పరాజయం చవిచూసింది.
ముంబయి చివర్లో గట్టిగా పోరాడినప్పటికీ విజయ తీరానికి చేరలేకపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (67: 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రజత్ పటీదార్ (64: 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (37) ఆకట్టుకున్నారు.
చివర్లో జితేశ్ శర్మ (40*), తక్కువ బంతుల్లో ధాటిగా ఆడి స్కోర్‌ను భారీగా మార్చాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య, బౌల్ట్ చెరో రెండు వికెట్లు తీశారు.
చెేజ్‌లో ముంబయి ఆరంభం నెమ్మదిగా సాగింది. కానీ తిలక్ వర్మ (56: 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (42: 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) వేగంగా ఆడుతూ జట్టుకు ఆశ కలిగించారు. చివర్లో వికెట్లు కోల్పోవడం స్కోరును ఆపేసింది.
ఆర్సీబీ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా 4 వికెట్లు, హేజిల్‌వుడ్, యశ్ దయాళ్ చెరో రెండు వికెట్లు తీశారు. ముఖ్యంగా కృనాల్ మ్యాచును తిప్పేశాడు. దీంతో ముంబయికి చివరికి అపజయం తప్పలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి విరాట్ కోహ్లీగా ఎంపికయ్యాడు.