న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో ఇటీవల జరిగిన అంతరాయాలు పెద్ద ప్రభావం చూపుతున్నాయి. తాజాగా, మైక్రోసాఫ్ట్ కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ వేదిక అజ్యూర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరోసారి సేవలకు అంతరాయం ఏర్పడింది.
మొదటగా యూరప్ లో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు, తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్నవారూ అదే సమస్యను ఎదుర్కొన్నారు. అజ్యూర్ సేవలు నిలిచిపోవడంతో భారీ ఎత్తున యూజర్లు ఆందోళన చెందారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి అజ్యూర్ సేవలు నిలిచిపోవడం ప్రారంభమైందని ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ, తమ ఇంజినీరింగ్ బృందాలు సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపింది.