టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగుల పనితీరు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఐదు రోజుల గడువు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హెచ్‌ఆర్ హెడ్ అమీ కోల్మన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (GVSA) పేరుతో కొత్త విధానం తెచ్చారు. ఉద్యోగులు రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి.. పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP) లేదా 16 వారాల వేతనంతో స్వచ్ఛంద నిష్క్రమణ. అయితే, ఈ ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఇవ్వడం ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతోంది.
ఈ నిర్ణయంతో బాధితులకు అంతర్గత బదిలీ అవకాశాలు కూడా ఉండవు. PIPలో ఉన్నవారికి ప్యాకేజీ లేదు. అలాగే నిష్క్రమించినవారు రెండు సంవత్సరాలు మైక్రోసాఫ్ట్‌లో తిరిగి దరఖాస్తు చేసుకోలేరు.
అమీ ఈ మార్పుల వెనుక “జవాబుదారీతనం, పారదర్శకత” ఉన్నాయని చెబుతుండగా, ఉద్యోగుల మధ్య అసంతృప్తి పెరుగుతోంది. తక్కువ సమయం లో భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాల్సి రావడం, కాంపెనీ ప్రాసెస్ పై విమర్శలకు దారితీస్తోంది.
పనితీరు మెరుగుపరుచుకోవడంలో ఉద్యోగులకు సహకరించాల్సిన సమయంలో ఇలా తొలగింపు దిశగా నడిపించడంపై సీరియస్ డిబేట్ మొదలైంది.