టాలీవుడ్: ‘దొరసాని’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన హీరో ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయం అయిన ఈ హీరో తన రెండవ ప్రయత్నంగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘ అనే సినిమా తో వస్తున్నాడు. 96 సినిమా ఫేమ్ వర్ష బొల్లమా ఈ సినిమా లో ఆనంద్ కి జోడీ గా నటిస్తుంది. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. కరోనా నేపథ్యం లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ నెల చివర్లో విడుదల చేయబోతున్నారు. నవంబర్ 20 నుండి ఈ సినిమా ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండబోతుంది. జనార్ధన్ పసుమర్తి ఈ సినిమాకి కథ మరియు మాటలు రాశాడు. స్వీకర్ అగస్తి ఈ సినిమాకి సంగీతం అందించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు.
ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే సినిమా ట్రైలర్ లో మిడిల్ క్లాస్ జీవితాల్లో ఉండే కష్టాలు, వాళ్ళ ఆనందాల్ని, బాధల్ని చూపించినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో హీరో ఆనంద్ తండ్రి టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. ఆ టిఫిన్ సెంటర్ లో ఆనంద్ చేసే బొంబాయి చెట్నీ బాగా ఫేమస్. అదే ఉదేశ్యం లో గుంటూరు కి వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టి బాగా డబ్బులు సంపాదిద్దామని బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళాక ఎలాంటి రకమైన సమస్యలని ఎదుర్కొంటాడు చివరకి తన టిఫిన్ సెంటర్ విజయవంతం అవుతుందా లేదా అనేది మిగతా కథనం అనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ ఆద్యంతం వినోదం తో ఆకట్టుకుంది.