ఏపీ: ఏపీలో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
టీడీపీ నేత చంద్రబాబు తలుపు తెరిస్తే వైసీపీ ఖాళీ కావడం ఖాయమని మండపల్లి వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే చంద్రబాబు టచ్‌లో ఉన్నారని తెలిపారు.
వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, “వైసీపీలో చివరికి నలుగురు రెడ్లే మిగిలిపోతారు,” అని మండపల్లి వ్యంగ్యంగా అన్నారు.
వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, టీడీపీ కలసైగతో వలసలు గంగా ప్రవాహంలా ఉంటాయని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల సందర్భంలో వైసీపీ నుంచి పోటీ చేసేవారే ఉండరని, జమిలి ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా వైసీపీ పరాభవం తప్పదని మండపల్లి తెలిపారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుమార్పులకు సంకేతమా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.