హనుమాన్ హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ సజ్జా, మిరాయ్ సినిమాతో మరోసారి సందడి చేయనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
రితికా నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా, రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. మిరాయ్ కాన్సెప్ట్ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ప్రేక్షకుల మదిలో ఇంట్రిగింగ్ హైప్ కల్పించింది.
మేకర్స్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, మిరాయ్‌ను ఆగస్టు 1న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
ఆ వారం తర్వాత వరుసగా ఎన్టీఆర్ వార్ 2, రజనీ కూలీ, ఉపేంద్ర 45 వంటి సినిమాలు విడుదల కానుండగా.. వీటిలో ఏదైనా వాయిదా పడే అవకాశమున్న నేపథ్యంలో, మొదటి వారం విడుదల ద్వారా పెద్ద విండో దక్కుతుందన్న లాజిక్‌తో ముందుకెళ్తున్నారు.
ఈ స్మార్ట్ మూవ్‌తో మిరాయ్ బిజినెస్ పరంగా స్పేస్‌ను సరిగ్గా క్యాష్ చేసుకునే అవకాశముంది. తేజ సజ్జా సూపర్ యోధుడిగా కనిపించనున్న ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ గా కూడా హై లెవెల్‌లో ఉండనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.