టాలీవుడ్: అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ‘ సినిమా ద్వారా సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు ‘స్వరూప్ ఆర్ఎస్ జె’. తీసిన మొదటి సినిమా తోనే అందరి కళ్ళల్లో పడ్డాడు. టాలెంటెడ్ దర్శకుడిగా పేరు పొందాడు. అతి తక్కువ బడ్జెట్ తో లిమిటెడ్ రిసోర్సెస్ తో సినిమాని అద్భుతంగా తీసి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా తర్వాత హీరో నవీన్ పోలిశెట్టి కూడా మంచి పేరు సంపాదించాడు. ఈ డైరెక్టర్ నుండి రెండవ సినిమా ఎపుడు వస్తుంది ఎలా ఉంటుంది అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఇదివరకే ఒక ప్రకటన ద్వారా తెలియచేసారు. ఈ సినిమా షూటింగ్ నిన్ననే ప్రారంభించారు. ఈ సందర్భంగా టైటిల్ తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు సినిమా టీం.
స్వరూప్ తన రెండవ సినిమాని ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. టైటిల్ కూడా క్రియేటివ్ గా పెట్టారు. మొదట ‘మిషన్ ఇంపాజిబుల్’ అని పూర్తి ఇంగ్లీష్ లో కరెక్ట్ స్పెల్లింగ్ పెట్టి ఆ తర్వాత లోకల్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఎలాంటి స్పెల్లింగ్ రాస్తారో ఆలా మీనింగ్ వచ్చేట్టు పెట్టి మరో సరి తన క్రియేటివిటీ ని టైటిల్ తోనే చూపెట్టాడు డైరెక్టర్. ఆత్రేయ సినిమాకి నెల్లూరు లాంటి టౌన్ ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నట్టే ఈ సినిమాకి కూడా తిరుపతి ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడు. విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో శివుడు, రాముడు , హనుమంతుని గెటప్ లో పిల్లలు ఉండి వాల్ల చేతిలో తుపాకి లు పెట్టి కొత్తగా చూపించారు అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో వాంటెడ్ అనే పోస్టర్ పెట్టి మరో స్పై సినిమా నా అనే సందేహం కూడా క్రియేట్ చేసారు. నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి కలిసి మాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆచార్య లాంటి పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా తీస్తూ బాలన్స్ చేస్తున్నారు ఈ నిర్మాతలు.