తిరుపతి: తిరుపతి జిల్లాలోని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తనను మరియు తన కుటుంబాన్ని హానీ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపారు.
బాధితురాలు ఈ విషయాన్ని పెన్ కెమెరా ద్వారా రికార్డు చేసిందని, తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.
కోనేటి ఆదిమూలం వందసార్లు కాల్స్ చేసి, మెసేజ్‌ల ద్వారా బెదిరించినట్లు ఆమె పేర్కొంది. ఆయన తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, బీమాస్ హోటల్‌ను తన అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు.
టీడీపీ సస్పెన్షన్:
ఈ ఘటనపై స్పందించిన టీడీపీ హైకమాండ్ కోనేటి ఆదిమూలాన్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేస్తూ, ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు దేశం పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు రావడం, వీడియోలు బయటపడటం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
వీడియో బయటపడటంతో కలకలం:
కోనేటి ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటపడటంతో, ఈ ఆరోపణలు మరింత బలపడ్డాయి. బాధితురాలు, ఆమె భర్త ఎమ్మెల్యే మీద తీవ్రమైన ఆరోపణలు చేయడంతో, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోనేటి ఆదిమూలం భీమాస్ హోటల్‌లో పలుసార్లు తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై ఒత్తిడి తెచ్చి బెదిరించాడని బాధితురాలు వెల్లడించారు.
అతని నీచ ప్రవర్తన బట్టబయలు:
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, కోనేటి ఆదిమూలం తన మొబైల్ నంబర్ తీసుకొని పదే పదే కాల్స్ చేసేవాడని, తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో రమ్మని చెప్పి రూమ్ నెంబర్ 109లో తనపై లైంగిక దాడి చేసాడని వివరించింది. ఆమె తనపై జరిగిన దాడులను నిరూపించడానికి పెన్ కెమెరా ఉపయోగించి రికార్డు చేసిందని తెలిపింది.
బాధితురాలి విజ్ఞప్తి:
ఎమ్మెల్యే ఆదిమూలం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, పార్టీ మహిళా కార్యకర్తలను ఆయన నుండి కాపాడాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. అతని నీచ పనులు బయటపడాలని కోరుతూ, బాధితురాలు మాట్లాడుతూ, అతని చేతిలో ఎన్నో మహిళలు బాధపడ్డారని తెలిపారు.