అమరావతి: ఏపీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణికి కరోనా వైరస్ సోకింది. ఆయనకు కోవిడ్ ప్రరీక్షలో పాజిటివ్ అని తేలిందని ఆయన ఒక లేఖను విడుదల చేశారు. కాగా ఇప్పటికే ఏపీ లో పలువురు రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ రావడం విదితమే.
ఆయన తన లేఖలో ఇలా పేర్కొన్నారు ” నాకు కరోనా పాజిటివ్ అని పరీక్షలో తేలింది. అందుకు నేను హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగా ఉందని, నన్ను కలవడానికి ఎవరు రావద్దని, కనీసం ఫోన్ కాల్ కూడా చేయవద్దని కోరుతున్నాను ” అని పేర్కొన్నారు.
ఇటివల తనతో ప్రయాణించిన వారు, నియోజకవర్గానికి వచ్చినప్పుడు తనని కలిసిన అందరూ ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చినప్పుడు మాస్కులు వాడాలని, భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని, ఎవరిని వారే భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తన ఆరోగ్య విషయాలను సోషల్ మిడియా ద్వారా తెలియజేస్తుంటానన్నారు.