హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన బండి సంజయ్ కుమార్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ విభాగం బుధవారం ఓ ప్రకటనలో తెలియ జేసింది. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని బండి సంజయ్ ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వీరిద్దరి మధ్య సంభాషణ దాదాపు 10 నిమిషాలపాటు జరిగిందని తెలిసింది, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ప్రధాని ఆయనతో ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై వివరాలు ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
ఈ ఎన్నికల సమయంలో కార్యకర్తలు చాలా అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని మోదీ వారిని అభినందించారు. బీజేపీ పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాని కొనియాడారు.
తెలంగాణ పార్టీ క్యాడర్ నూతన ఉత్సాహంతో నడవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు దైర్యంగా ముందుకు సాగాలని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి’ అని ప్రధాని మోదీ సూచించినట్లు తెలంగాణ బీజేపీ ఆ ప్రకటనలో తెలిపింది.