ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఫ్రాన్స్, అమెరికా దేశాలను సందర్శించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ ఖరారు చేసింది.
ఫ్రాన్స్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సులో పాల్గొనడానికి మోదీ 10వ తేదీన ప్యారిస్‌కు వెళ్లనున్నారు.
ఫ్రాన్స్‌లో ఆయన అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్‌తో సమావేశం కానున్నారు. అంతేగాక, న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో చర్చించనున్నారు.
ఫ్రాన్స్‌లో మూడు రోజుల పాటు పర్యటించిన అనంతరం 12వ తేదీన మోదీ అమెరికా బయలుదేరి వెళతారు.
అమెరికాలో ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవ్వనున్నారు. ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపే అవకాశముంది.
మోదీ ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ పారిస్, వాషింగ్టన్ నగరాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చే ఈ పర్యటనపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.