fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్

మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్

MohanBabu SonOfIndia TeaserRelease

టాలీవుడ్: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముఖ్య పాత్రలో ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ని ప్రముఖ తమిళ నటుడు సూర్య విడుదల చేసారు. చాలా సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ మెగా స్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయింది.

మీ అంచనాలకి అందని వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను, ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తాడో ఆ దేవుడికే ఎరుక’ అని చిరంజీవి వాయిస్ ఓవర్ లో మోహన్ బాబు పాత్ర గురించి చిరు ఇంట్రో ఇస్తాడు. ఆ తర్వాత మోహన్ బాబు ‘నేను చీకటిలో ఉండే వెలుతురుని.. వెలుతురులో ఉండే చీకటిని’ మరియు ‘నేను కసక్ అంటే మీరందరు ఫసక్’ అని తనని విపరీతంగా ట్రోల్ చేసిన డైలాగ్ వాడి ట్రైలర్ ముగించారు.

రైటర్ గా పేరున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ బాబు కుమారుడు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ ‘సన్ ఆఫ్ ఇండియా’ మోహన్ బాబు తో పాటు మరో సీనియర్ టెక్నీషియన్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి పని చేస్తున్నాడు. ఆయనెవరో కాదు ఇళయరాజా, ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా విడుదల వివరాలు మరి కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular