నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ అయినా, ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కేవలం పోస్టర్ మాత్రమే విడుదల చేశారు.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే మోక్షు బాబు మూవీ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్ వంటి విభాగాల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
మొత్తానికి జై హనుమాన్ షూటింగ్ 2025 చివర్లో ముగిసే అవకాశం ఉంది. అందువల్ల మోక్షజ్ఞ మూవీ 2026లోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తతో నందమూరి అభిమానులు కాస్త సంతృప్తి చెందుతున్నారు.