మూవీడెస్క్: నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా డిసెంబర్ 5న ప్రారంభం కావాలని ప్రకటించగా, ఊహించని విధంగా షూటింగ్ స్టార్ట్ కాలేదు.
ఈ సడెన్ బ్రేక్ ఎందుకు అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, మంచి స్పందన అందుకున్న ఈ సినిమా, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని ప్రకటించారు.
హనుమాన్ లాంటి విజయాన్ని అందుకుంటుందనే ఆశలు కూడా అభిమానుల్లో ఏర్పడ్డాయి. కానీ, తాజా పరిణామాలతో ఈ సినిమాపై సందిగ్ధత నెలకొంది.
కొందరు క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సినిమా ఆగిపోయిందని అంటుండగా, మరికొందరు కేవలం స్క్రిప్ట్ ఫైనల్ టచ్ కోసం షూటింగ్ వాయిదా వేసారనే మాట చెబుతున్నారు.
మోక్షజ్ఞ కెమెరా ముందు నిలబడటానికి ఇంకా మెంటల్ గా సిద్ధంగా లేరన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక, ఈ సినిమా ఆగిపోయిందనే గాసిప్ మధ్య మోక్షజ్ఞ రెండో సినిమా గురించి కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పై కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని టాక్.
బాలకృష్ణ తనయుడి డెబ్యూ సినిమాకు ఇలాంటి అడ్డంకులు ఎదురవ్వడం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది.
ఈ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చే వరకు మరిన్ని ఊహాగానాలు కొనసాగుతాయనడంలో సందేహం లేదు.