మూవీడెస్క్: నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
మొదటి సినిమా కోసం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమా కూడా సిద్ధమవుతోందనే వార్త వినిపిస్తోంది.
మోక్షజ్ఞ తన రెండో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు వెంకీ అట్లూరి దర్శకుడిగా ఫిక్స్ అయ్యారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే దుల్కర్ సల్మాన్‌తో “లక్కీ భాస్కర్” వంటి పెద్ద హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, మోక్షజ్ఞ కోసం ఓ స్పెషల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకీ అట్లూరి ఇప్పటి వరకు ప్రేమ కథలు, కుటుంబ సంబంధాలు, ఎమోషన్లతో కూడిన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
మోక్షజ్ఞ కోసం మాత్రం ఆయన మరింత విభిన్నమైన, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ దశలో ఉండగా, బాలకృష్ణతో జరిగిన చర్చల అనంతరం మోక్షజ్ఞ రెండో సినిమాకు వెంకీ అట్లూరి పేరు ఖరారు అయ్యిందని తెలుస్తోంది.
నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా, మోక్షజ్ఞ కెరీర్‌ను మరింత బలపర్చే విధంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.