మూవీడెస్క్: నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు టాక్ వచ్చింది.
కానీ, బాలయ్య క్లారిటీ ఇచ్చిన తర్వాత అభిమానులు కాస్త ఊరట చెందారు.
ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ రెండో చిత్రానికి సంబంధించి భారీ క్రేజ్ నెలకొంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ తదుపరి చిత్రం చేయబోతున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
లక్కీ భాస్కర్ విజయం చూసిన బాలకృష్ణ, వెంకీ అట్లూరిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌ను తనయుడికి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.
ఇక ఆ ప్రాజెక్టు సెట్టయినట్లు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. నాగవంశీ మాట్లాడుతూ, వెంకీ అట్లూరి టేకింగ్ పట్ల బాలయ్యకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు.
బాలకృష్ణ, మోక్షజ్ఞకు కొత్త జోనర్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇది సరైన అవకాశం అని భావించినట్లు పేర్కొన్నారు.
స్టోరీలైన్ కూడా కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది.